నేటి గదర్, మే 18, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా గంజాయి దర్శనమిచ్చిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో శనివారం చోటు చసుకుందిభ. సంఘటనకు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాచలం వైపు వస్తున్న ఒక ద్విచక్ర వాహనం సారపాక సెంటర్ వద్ద మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. రెండు వాహనాలు కిందపడగా భద్రాచలం వైపు నుండి వస్తున్న బైకులు సుమారు రెండు కేజీల గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో గంజాయి తరలిస్తున్న వాహనంపై ముగ్గురు యువకులు ఉండగా వారు బైకును అక్కడే వదిలేసి పరాలైనట్లు స్థానికలు తెలుపుతున్నాను. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 1,073