..
MGR పాలిటెక్నిక్ మణుగూరు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్ కుమార్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 21:
మణుగూరు మండల కేంద్రంలోని మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు మణుగూరు ZPHS పాఠశాలలో ఈనెల 24వ తేదీన శుక్రవారం డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా మణుగూరు కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మరియు మణుగూరు ZPHS పాఠశాలలో మొత్తం 403 మంది విద్యార్థులని కేటాయించినట్లుగా పేర్కొన్నారు.24వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన కోరారు.ఈ పరీక్షకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించారని అన్నారు. అదేవిధంగా పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్ష హాల్ ను విడిచి వెళ్ళరాదన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ తో మాత్రమే హాజరు కావాల్సి ఉందన్నారు. విద్యార్థులు వారి యొక్క హెచ్చి పెన్సిల్,పెన్ను,ఎరేజర్ సార్పేనర్,వంటివి మాత్రమే తీసుకరావాలి.అలాగే విద్యార్దులు సెల్ ఫోన్ కానీ బ్లూటూత్,హెడ్ షెట్ట్ తీసుకరాకూడదని ఆయన పేర్కొన్నారు.