నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 8:
LRSపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు.LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన సంబంధిత దరఖాస్తులను పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే LRS దరఖాస్తులు పూర్తిచేయకపోవడానికి గల కారణాలపై సమీక్షించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఆదాయం పెంచే మార్గాలపై అన్వేషించాలి…
ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు.పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలని,ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ,ఎక్సైజ్,రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు.