– ఎన్నో ఆశలతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నా
– ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నేటి గదర్, జూన్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేసే విధంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం, పత్రికా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజా పాలన సక్రమంగా పరిపాలించడానికి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి విధులు నిర్వహిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, త్రాగునీరు, విద్యా, వైద్యం, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, కల్వర్టులు మీద ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అలాగే అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు, ఒంటరి మహిళలకు, ఆసరా పింఛన్లు అందేలా చూడాలని తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామపంచాయతీలలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడి స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏమైనా రిపేర్లు ఉంటే సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.