పట్టణ నడిబొడ్డులో ఇది పరిస్థితి…
మున్సిపల్ కమిషనర్ ఇటు చూడండి…
పారిశుద్ధ్యం వరద ముంపు పై ముందే చెప్పిన నేటి గదర్ న్యూస్ ప్రతినిధి.
నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 23:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు పట్టణంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి పట్టణం పురవీధుల్లో వర్షపు నీరు డ్రైనేజీల్లో నిండిపోయి రోడ్డు మీదకు రావడం వలన ప్రయాణికులకు అంతరాయంగా మారింది.డ్రైనేజీలో ఉన్న చెత్తాచెదారం దుర్వాసనలతో రోడ్డు పైకి రావడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.మణుగూరు పట్టణ మడిబొడ్డులో సత్య భాస్కర థియేటర్స్ అందులో రోడ్డుపై రెండు అడుగుల లోతుతో వరద ప్రవహిస్తుంది. ఈ చిన్న వర్షానికి రోడ్లు మొత్తం వర్షపు నీటితో దిగ్బంధనం జరిగితే రాబోయే వర్షాకాలంలో ఇంకా ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ సిబ్బంది,అధికారులు మణుగూరు పట్టణంలో వేసవి కాలంలోనే వర్షాకాలంలో వచ్చేటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి పరిశీలించి అట్టి సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అధికారులు నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరించడం వలన ఇలాంటి పరిస్థితులు దాపరిస్తున్నాయని పట్టణ ప్రముఖులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ అయ్యా నీవు ఎక్కడ ఉన్నావు అంటూ ఒక్కసారి మా వాడలు,వీధులు చూసి వెళ్ళమని ప్రజలు వాపోతున్నారు.కమిషనర్ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వలన ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ వరదల వలన పిల్లలకి పెద్దలకి ప్రజలకి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగిన వీటన్నింటికీ పూర్తి బాధ్యత మున్సిపాలిటీ కమిషనర్ దే అని పుర ప్రముఖులు,వ్యాపారస్తులు మండిపడుతున్నారు.