జిల్లా వ్యాప్తంగా దాదాపు 100
శాతం ఇంటింటా సర్వే జరిగింది.
సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21:
డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా నమోదును ఎలాంటి తప్పులు లేకుండా బాధ్యతాయుతంగా పక్కగా చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు.
గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో గల భవనంలో
సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ తీరును జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఎంట్రీ నమోదుకు లాగిన్ ఇవ్వడం జరిగినదని, డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా తప్పులు లేకుండా పక్కాగా చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు గా 100 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఎన్యూమనేటర్లకు ప్రజలు సహకరించారని సర్వే వేగవంతంగా పూర్తి జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఎం.పి. ఓ. రహీం, ఈ డి ఎం దేవేందర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితరులు
పాల్గొన్నారు.