రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పుట్టి రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే మత్స్యకారులకు ఎంతో గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచంలో అన్ని రాష్ట్రాలలో మత్స్యకారులకు ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నాయని ఆయన తెలిపారు.కొన్ని రాష్ట్రాలలో ముదిరాజ్ మత్స్యకారులకు ఎలాంటి సౌకర్యాలు కలగడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ముదిరాజ్ సంఘం మత్స్యకారులకు అనేక అభివృద్ధి పథకాలు,సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోచమ్మల సిద్ధరాములు,ఉపాధ్యక్షుడు రెడ్డమైన నరేష్,కోశాధికారి దేవుని రవి,సలహాదారులు రొయ్యల కిషన్,అక్కల మల్లేశం,మత్స్యకార సంఘం డైరెక్టర్లు రెడ్డమైన పోచయ్య, భూమ కిషన్, సార్లు బాగయ్య,పుట్టి పెద్ద స్వామి, పుట్టి స్వామి,దేవుని రాజు, భూమ మల్లేశం,పోచమ్మల గణేష్,చింతల నరేష్,దండు శివ,ఉమామహేష్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.