నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21:
ములుగు జిల్లాలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిధిలోని జంగాలపల్లి గ్రామాన్ని, నిమ్స్ వైద్య బృందము సందర్శించింది. మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మరియు అవగాహన సదస్సును పరిశీలించి, వైద్య సిబ్బంది అందించిన, సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నాటు వైద్యులను సంప్రదించి వైద్యము తీసుకొని ప్రాణాల మీదికి కొని తెచ్చుకోకూడదని, అవసరానికి మించి రెగ్యులర్గా పెయిన్ కిల్లర్ వాడకూడదని, అనారోగ్యము ఉన్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్లచే చికిత్స చేయించుకోవాలని సూచించారు. మూడు రోజు లు అందించిన సేవలు మరియు రక్త పరీక్షల రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందిని అభినందించారు .
అటు తరువాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులను టీ హబ్ కేంద్రాన్ని మరియు రేడియోలోజి హబ్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్. శ్రీకాంత్ డాక్టర్. పవన్ కుమార్ రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్. ప్రసాద్ ఇంచార్జ్ మాస్ మీడియా అధికారి సంపత్ జిల్లా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్ రావు , ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యులు డాక్టర్ ప్రేమ్ సింగ్ డాక్టర్ నవ్యరాణి ఆరోగ్య విస్తరణ అధికారి సురేష్ బాబు సూపర్వైజర్ దేవేందర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.









