◆పారదర్శకంగా ఆశావాహుళ సమక్షంలో వేలం నిర్వహిస్తానని తెలియజేసిన జిల్లా ఎస్ పి
*జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపిఎస్**
నేటి గదర్, జూన్ 23,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్, 6281272659:
జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన నిరుపయోగంగా ఉన్న వాహనాల పాత బ్యాటరీలు, టైర్లు, వాహనాల విడిభాగాలు తదితర ఇతర వస్తువులను వేలం వేస్తామని జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఐ పి ఎస్ తెలియజేశారు. వాటిని కొనుగోలు చేయుటకు ఆసక్తి కలిగిన వ్యక్తులు ఆధార్ కార్డుతో ఈ నెల అనగా 28-06-2024వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు.
ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా జిల్లా అదనపు ఎస్పీ సదానందం గారు వ్యవహరించనుండగా, నోడల్ అధికారిగా రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ మోటార్ ట్రాన్స్పోర్టు అధికారిగా సంతోష్ సభ్యులుగా రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గార్లు వ్యవహరించనున్నారు. సందేహాలు నివృత్తికై నోడల్ అధికారి కి కాల్ చేయవలసిందిగా కోరడమైనది 8712670107.