పలు సమస్యలను కలెక్టర్ కి వివరించిన తహశీల్దారు నాగప్రసాద్
నేటి గద్దర్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కెంద్రంలోని కరకగూడెం గ్రామం చిరుమళ్ళ గ్రామాల మధ్యలోని ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి గత సంవత్సరం కురిచిన వర్షాలకు చిరుమళ్ళ వైపు పూర్తిగా కోతకు గురై తాత్కాలిక మరమతులు చేసిన సంఘటన పాఠకులకు తెలిషిన విషయం విదితమే ఈ సంవత్సరం వర్షాకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యమ న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఆదివారం మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని నెలకొన్న కొన్న ప్రధాన సమస్యలను తహశీల్దారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో పూర్తి స్థాయిలో మరమత్తులు చేపట్టడం కష్టం కానీ అటువైపు ఉన్న గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం పోసిన మట్టి పోకుండా ప్రత్యామ్నాయం చేస్తామని తెలిపారు.అలాగే తహశీల్దారు మండలంలోని ప్రజలు ఎదురుకుంటున్న ప్రదాన సమస్యలైన మండలనికి బస్సు స్టాండ్, పబ్లిక్ టాయిలెట్స్,ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించితే ప్రజలకు ఎంత గానో ఉపయొగపడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో త్వరలోనే స్వచ్చ భారత్ ద్వారా పబ్లిక్ టాయిలెట్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడుళ్ల బయ్యారం సిఐ కరుణాకర్,ఎంపిడిఓ రామకృష్ణ,వివాద గ్రామపంచాయతిల సెక్రటరీలు ,వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.