నేటి గదర్ న్యూస్, భద్రాచలం:
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించిన ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాలలో లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు మరోసారి సత్తా చాటి రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులైన ఎంపీసీ విభాగంలో ఎండి సన తపస్సుము 468/470 మరో విద్యార్థిని బాజీ మోక్షిత 468/470. మరో విద్యార్థిని నలజాల లిఖిత 468/470.మార్కులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొదటి స్థానంతో పాటు స్టేట్ సెకండ్ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో ఒంటెద్దు గ్లోరీ.438/440 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు మాగంటి రమేష్ బాబు లు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లిటిల్ పేపర్స్ విద్యాసంస్థలు ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు. ఏకకాలంలో నలుగురు విద్యార్థినులు రాష్ట్ర సెకండ్ ర్యాంకును సాధించటం తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొదటి స్థానం నిలబడటం ఒక లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలకే సాధ్యమని స్పష్టం చేశారు. గత నెలలో ప్రకటించిన ఎంసెట్ జేఈఈ నీట్ ఫలితాలలో సైతం లిటిల్ ఫ్లవర్స్ అగ్రస్థానం నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు చే అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందించడం చేతనే ఇంతటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు ఇచ్చి అభినందించుటతో పాటు తల్లిదండ్రులను సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బషీర్ తో పాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు