watssap :9581905907
నేటి గదర్ న్యూస్, ఫోటో మీది… వార్త మాది
★
పీవీ కాలనీ సంతలో రసాయనాలు కలిపి కూరగాయలు విక్రయిస్తున్న వారి పై చర్యలు తీలుకోవాలి
★మణుగూరు ఏరియా టి బి జి కె యస్ నాయకులు నాగెల్లి
పీవీ కాలనీ సంతలో రసాయనాలు కలిపి విక్రయిస్తున్న అమ్మకుందారులపై యాజమాన్యం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలి.
మణుగూరు సింగరేణి పీవీ కాలనీ ఏరియాలో ప్రతి గురువారం నాడు నిర్వహిస్తున్న సంత విక్రయాల్లో కొంత మంది అమ్మకం దారులు రసాయనాలతో కలిపిన వస్తువులను విక్రయిస్తున్నారని మణుగూరు ఏరియా టి బి జి కె యస్ నాయకులు నాగెల్లి ఆరోపించారు.కార్మిక ఆరోగ్య శ్రేయస్సు, సౌలభ్యతను దృష్ఠిలో ఉంచుకొని యాజమాన్యం ప్రతి గురువారం నాడు సంతకు అనుమతిని అందించడం జరిగిందని సంబంధిత అధికారులు దానిపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా విక్రయదారులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కార్మిక వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు దెబ్బతినే చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు..ముఖ్యంగా ఫ్రూట్స్ లను రసాయనాలతో మాగేసిన పండ్లను విక్రయిస్తున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నట్టు ఆయన తెలిపారు..రసాయనాలు కలిపిన వస్తువులను తినడం వల్ల కార్మికులు వారి కుటుంబ సభ్యులు మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని దానివల్ల సంస్థ లక్ష్యం దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా సంస్థ నష్టపోయే ప్రమాదం ఉన్నందున యాజమాన్యం దృష్టి సారించి నాణ్యత ప్రమాణాలు పాటించే అమ్మ కుందారులకే సంతలో విక్రయించే అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు