★2కే రన్ నిర్వహించిన మణుగూరు డివిజన్ పోలీసులు
నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 26:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రక్స్ రహిత తెలంగాణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ నుండి సురక్ష బస్టాండ్ వరకు 2k రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,పోలీస్ శాఖ తరపున జిల్లా వ్యాప్తంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను పట్టుకోవడం జరుగుతుందన్నారు.ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాలు ఉన్న సమాచారం వెంటనే మాకు తెలియజేయాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి కోరారు.మాధక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా బుధవారం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మణుగూరు పట్టణంలో ప్రధాన రహదారిపై 2కే రన్ నిర్వహించామని తెలిపారు.మాధక ద్రవ్యాలు పట్ల యువత దూరంగా ఉండాలని, యువతతో పట్టణంలో ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో తాసిహల్దార్ రాఘవరెడ్డి, మణుగూరు సీఐ సతీష్ కుమార్, అశ్వాపురం సీఐ అశోక రెడ్డి,ఈ బయ్యారం సీఐ కరుణాకర్, మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్,అశ్వాపురం ఎస్సై సురేష్, తిరుపతి,ఈ బయ్యారం ఎస్ఐ వెంకటప్పయ్య,మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి,మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావు,ఎఫ్డీఒ సయ్యద్ మక్సూద్,గోవిందు,అజ్మీర శాంతి తదితరులు పాల్గొన్నారు.