నేటి గదర్ న్యూస్ ,జులై 9 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అలవాటుగా మారాలని కూసుమంచి డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర పిలుపునిచ్చారు… మంగళవారం కూసుమంచి రైతు వేదిక ఆవరణలో ఏఓ వాణి , ఏఈఓ లతో కలిసి వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈఓ లందరూ వనమహోత్సవం కార్యక్రమంలో ఇచ్చిన టార్గెట్ ను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని కోరారు. ప్రాణాధారమైన చెట్లు మనిషి మనుగడకు మూలాధారమైనవి ,చెట్లను నరకడం ద్వారా కాలుష్యం పెరిగి వర్షాలు రాకా మనిషి మనుగడ ప్రశ్నార్థకం ఆయే ప్రమాదం పొంచివుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఏవోలు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఏవోలు ,ఏఈవోలు పాల్గొన్నారు.
Post Views: 292