– జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు, జూలై 09: ఈ నెల నుండి ప్రతి నేలా ఆఖరి శుక్రవారం ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని శాఖల ప్రధాన అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తూ వారి వారి కింది సిబ్బందికి సమాచార౦ చేరవేయాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ నెలలో చివరి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Post Views: 83