◆హనుమకొండ బార్ అసోసియేషన్
ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్
◆అడ్వకేట్ పై దురుసు ప్రవర్తన కు నిరసన తెలిపిన న్యాయవాదులు
నేటి గదర్ వెబ్ డెస్క్:
శనివారం సాయంత్రం కాశిబుగ్గ వివేకానంద కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర తన కుటుంబంతో కారులో వస్తున్న వినయ్ కుమార్ అనే అడ్వకేట్ పై దురుసుగా ప్రవర్తించిన ఇంతేజారగంజ్ సిఐ శివకుమార్ ని సస్పెండ్ చేయాలని హనుమకొండ లోని అదాలత్ సెంటర్లో హనంకొండ మరియు వరంగల్ న్యాయవాదులు ధర్నా నిర్వహించారు.
*సిఐ బేషరతుగా క్షమాపణ చెప్పాలి*
అన్యాయంగా, న్యాయవాదుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి న్యాయవాదులను న్యాయవాద వృత్తిని అగౌరవపరిచి మాట్లాడిన సీఐ శివకుమార్ ని తక్షణమే భేషరతుగా క్షమాపణలు తెలియజేయాలని తెలియజేస్తూ, అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో వరంగల్ -హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ గారు, వరంగల్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముధసిర్ అహ్మద్ ఖయ్యూమి, హనంకొండ జనరల్ సెక్రటరీ రమేష్ గారు, గంధం శివ వేముల రమేష్ వరంగల్ బారాసోసియేషన్ ఏసి మెంబర్లు పెండ్యాల అనిల్ కుమార్ రాజ్ కుమార్ విక్రమ్ హనుమకొండ ఈసీ మెంబర్లు అచ్యుత్ సుహాస్ అనిల్ నాయక్, న్యాయవాదులు పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిఐ శివకుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రేపు ఉదయాన్నే మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని న్యాయవాదులు అందరి పక్షాన డిమాండ్ చేశారు.