అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయండి
– జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్
నేటి గద్దర్ పాడేరు న్యూస్
అల్లూరి జిల్లా పాడేరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ తన సూచనలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనుకోని సంఘటనలు సంభవిస్తే కలెక్టర్ కార్యాలయమునకు తెలియజేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.
Post Views: 67