నేటి గద్దర్ న్యూస్ జులై20: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు.
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఎంపిడిఓ ఆఫీస్ చుట్టుపక్కల విద్యుత్ తీగల లైన్లను, టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు తో, వైరా విద్యుత్ శాఖ ఏడి. బి రామకృష్ణ,ఏఈ ఏఈ.S.S.S. కుమార్, ఫోర్ మెన్ కే.శ్రీనివాసరావు, లైన్మెన్ సిహెచ్ కృష్ణ ప్రసాద్ తదితర బృందం పరిశీలించడం జరిగింది. అనంతరం అక్కడి ప్రజలకు ఏడి బి రామకృష్ణ పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ప్రజల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే విద్యుత్ వల్ల కరెంటు షాపులు సంబంధించి ప్రమాదం చేకూరి అవకాశం ఉందని తెలియజేశారు. తొందర్లోనే ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్లను షిఫ్టింగ్ చేస్తామని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల సంతోష్, బండ్ల కృష్ణ, షేక్ పాషా, చుట్టుపక్కల ప్రజానీకం పాల్గొన్నారు.