సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాలులో
జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలోని వివిధ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి యువతి యువకులకు శ్రీ రాహుల్ రాజ్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తీర్ణులైన యువతీ యువకులకు సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆసక్తిగల యువతి యువకులను ఎంపిక చేసుకుని వివిధ రంగాలలో వారికి శిక్షణ అందించడం జరిగిందని తద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని శిక్షణ తీసుకున్న యువతీ యువకులకు వారి ఆసక్తిని బట్టి ఆ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం బ్యాంకుల ద్వారా లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందని ప్రతి అంశంలో బేసిక్స్ నేర్చుకోవాలని నూతనంగా ఆలోచించి
ఆ రంగంలో నైపుణ్యత సంపాదించుకోవాలని చెప్పారు.
2022 నుండి ఇప్పటివరకు మొత్తం 8 బ్యాచ్లలో 727 మంది యువతి యువకులు వివిధ కోర్సులలో శిక్షణ తీసుకున్నారని తెలిపారు.
ప్రతి కోర్స్ యొక్క శిక్షణ కాలం 3నెలలు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం 6వ మరియు 7 వ బ్యాచ్ లోని 117 మంది శిక్షణ పూర్తి చేసుకుని ఉత్తీర్ణులైన యువతీ యువకులకు సర్టిఫికెట్స్ అందజేశామన్నారు. 9వ బ్యాచ్ అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని . కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి నాగరాజు, సెంటర్ ఇన్చార్జ్ మనీషా, సిబ్బంది రాజు, లలిత, అనిత , సంతోష, రాజేంద్రప్రసాద్ మరియు తయ్యబ్ పాల్గొన్నారు.