★ఓసి-2 లో నూతనంగా నిర్మించిన సైట్ ఆఫీస్ ఎస్ అండ్ డి సెక్షన్ కు వెళ్లాలంటే కార్మికులకు నరకయాతనే…
★సమస్యలపై స్పందించని అధికారుల తీరుపై కార్మికుల ఆగ్రహం…
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 20:
నైనారపు నాగేశ్వరరావు ✍️
9121 463 468
మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ ఓసి2 లో నూతనంగా నిర్మించిన సైట్ ఆఫీస్ వద్ద చినుకు పడితే చిత్తడే అన్నచందంగా అక్కడ పరిస్థితి ఉంది. అక్కడకు వెళ్లాలంటే సింగరేణి కార్మికులు,కాంట్రాక్ట్ కార్మికులు కొండాపురం సిఎస్ పి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల కార్మికుల ద్విచక్ర వాహనాలు జారి పడి దెబ్బలు తాకిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయని,వరద వస్తే రాకపోకలకు ఇబ్బంది అవుతుందని కార్మికులు వాపోతున్నారు.ఇది ఇలా ఉండగా ఎస్ అండ్ డి సెక్షన్లో కార్మికులు ఇన్ అవుట్ పడి విధుల రాకపోకలకు కార్మికులు నరకయాతన పడుతున్నారు. దానికి తోడు సులభ్ కాంప్లెక్స్ వెళ్లడానికి దారి లేదు.వాటిని శుభ్రం చేయడానికి కూడా స్రావెంజర్లు లేక దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న గానీ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. త్రాగునీరుకు ఓఆర్ ప్లాంటు ఏర్పాటు లేదని కూడా చెబుతున్నారు.ఇప్పటికైనా ఓసి టు అధికారులు స్పందించి నూతన సైట్ ఆఫీసు వద్ద కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.