◆ఈ కార్యక్రమానికి మద్దతుగా ఏనుగు సుదర్శన్ రెడ్డి. హాజరైన మేడ్చల్ అసెంబ్లీ బిజెపి నాయకులు, కార్యకర్తలు, అశేష సంఖ్యలో నిరుద్యోగుల ప్రజలు
నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో:-
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఉన్న నిరుద్యోగ యువతను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తరువాత ఆయా హామీల అమలుపై ప్రశ్నించిన నిరుద్యోగ యువతను అవహేళన చేస్తూ..! నిర్బంధాలకు గురిచేస్తూ..!! ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా విచక్షణా రహితంగా పోలీసు లాఠీలను జూలిపిస్తు దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా చేస్తున్న మహా ధర్నా
ఈ కార్యక్రమాన్ని గూర్చి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
ఎన్నికల ఏడాది 2023 మే నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా ప్రకటించిన యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలైన
– ఎన్నికల కన్నా ముందు గత పాలకుడు చేసిన తప్పులైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 చొప్పున పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించి నేడు మళ్ళీ అదే 1:50 అంటూ కుంటి సాకులు చెప్తున్నారు.
– గ్రూపు 2 ఉద్యోగాల సంఖ్యను 783 నుండి 2000 లకు పెంచాలి
– గ్రూపు 3 ఉద్యోగాలను 1365 నుండి 3000 లకు పెంచాలి..
– రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతిని చెల్లించాలి (ఇప్పటికే బిజెపి – శివసేన ల ప్రభుత్వం లాడ్లి బెహన్ యోజన కింద అమ్మాయిలకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తుంది ఈ నెల నుండి అర్హులైన నిరుద్యోగుల యువకులకు 5500 కోట్లతో లాడ్లి బాయ్ యోజన కింద భృతిని చెల్లించబోతున్నారు..)
– ప్రతి సంవత్సరం జూన్ 2 న జాబ్ కాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని ఇచ్చిన డొల్ల హామీ అమలు లేదు..
– తెలంగాణలోని విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి,రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పిస్తామని చెప్పిన హామీ గాలికి వదిలేసినారు..
ఈ విధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. కానీ నిరుద్యోగ యువతను సమిదలుగా చేసి వారిని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి ఉపయోగ పడ్డ ఆనాటి రాజకీయ నిరుద్యోగులు బల్మూరి వెంకట్,తీన్మార్ మల్లన్న లకు ఎమ్మెల్సీలుగా లక్షల రూపాయలు వేతనం అధికార దర్పాలు పొందుతున్నారు. మరొక నాయకుడు కోదండరాం గారు గవర్నర్ కోటాలో ఎమెల్సి పదవి కొరకు నేడు పెదవులు మూసుకొని కూర్చోవడం దుర్మార్గం…అని దుయ్యబట్టారు.