★ఆదివారం ఉదయం 10 గంటలకు 37.1 అడుగులు గోదావరి
నేటి గదర్ న్యూస్, భద్రాచలం:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల కు 37.1 అడుగులకు నది నీటి మట్టం పెరగడం జరిగింది.అధికారులు మరి కొన్ని గంటలలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాల్లోనూ కుండపోత వర్షాలకు నీరు చేరడంతో.. భక్తులు ఇబ్బంది పడుతున్నారు.భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక,48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు