మండల వ్యవసాయ అధికారి వాణి..
నేటి గదర్ న్యూస్ , జులై 21(పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండలంలో జూన్ 28 ,2024 నాటికి కొత్తగా పాస్ బుక్ పొందిన 679 మంది రైతులలో 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రైతులు అనగా 14.8.1965 నుండి 14 .8.2006 మధ్య జన్మించిన రైతులందరూ రైతు బీమా పథకానికి అర్హులు అని తెలిపారు . రైతు బీమా పథకానికి దరఖాస్తు సమర్పించడానికి జతపరచవలసినవి దరఖాస్తు ఫారం, భూమి పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ నామిని ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలి అని తెలిపారు. దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ ఆగస్టు 5, 2024 . గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతులు తమ వివరాలలో పొరపాట్లు లేదా మార్పులు (నామినీ చనిపోయిన సందర్భాలు) ఉంటే సరి చేసుకోవడానికి ఆఖరి తేదీ జూలై 30, 2024. కావున రైతులందరూ సంబంధిత గడువులోగా వారి వారి క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తును రైతు స్వయంగా వచ్చి సమర్పించవలెను అని తెలిపారు. అర్హత వయసు కలిగి ఉండి గతంలో రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతుల నుండి కూడా దరఖాస్తు స్వీకరించబడును అని పేర్కొన్నారు.