నేటి గదర్ న్యూస్,అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:
చంద్రుగొండ మండలం పోకలగూడెం గ్రామ శ్రీ భక్త ఆంజనేయస్వామి భక్త బృందం వారిచే గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం 108సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ ఏన్కూరు లోనిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గురువు చలమల వెంకటేశ్వర్లు ని ఏన్కూరు గ్రామ ఆంజనేయ స్వామి భక్త. బృందం శాలువతో సన్మానించారు. అనంతరం గురూజీ వెంకటేశ్వర్లు స్వామి మాట్లాడుతూ భక్తులు అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ సంప్రదాయాలను కాపా డుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని మత మార్చి డి చేసుకోవటం నేరం గా భావించాలి.వేరే మతంలో వెళ్లిన వారు చాలా మంది తిరిగి హిందూ మతంలో వస్తున్నారని వారన్నారు.బారత దేశంలోనే కాదు. ఇతర దేశాల్లో కూడా మన హిందూ సంప్రదాయాలను గౌరవం లభిష్ఠుంధని గుర్తుచేశారు.హిందూవులం అందరం ఏకం కావాలి,ఐక్యంగా ముందుకు సాగాలి అన్నారు.ఈ కార్యక్రమంలో పూజల లక్ష్మయ్య,మదు,ప్రభాకర్,మహిళా భక్తులు పాల్గొన్నారు.జై శ్రీ రామ్,శ్రీ శీతారాంజనేయ స్వామికి జై అంటూ నినాధాలు చేసారు.