నేటి గదర్, జూలై 21,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 40.80 ఉన్న నీటిమట్టం సాయంత్రం, 4 గంటల సమయానికి 41.30 అడుగులకు చేరుకుంది. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల ప్రవాహం వద్ద, 48 అడుగులకు నీటి ప్రవాహం చేరుకున్నప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తారు. ఇప్పటికే లంక గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
Post Views: 304