★వెల్దుర్తి కంకర మిషన్ వాళ్ళ సహకారంతో BT రహదారి పై గుంతలు పూడ్చి వాహనదారుల నరకయాతన తప్పించారు
★మెదక్ ,నర్సాపూర్ ఎమ్మెల్యే లు డబల్ రోడ్డు మంజూరుకు కృషి చేయాలి
★BRS మండల అధ్యక్షులు ,ఉప్పులింగాపూర్
మాజీ సర్పంచ్ వంచ భూపాల్ రెడ్డి.
నేటి గద్దర్ న్యూస్, వెల్దుర్తి మండలం(జూలై24):BRS మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చొరవతో గత కొన్ని రోజులుగా నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకు వాహనదారులకు బీటీ రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల నుంచి నుంచి విముక్తి కల్పించి మానవత్వం చాటుకున్నారు .వివరాలు ఇలా ఉన్నాయి.వెల్దుర్తి ,మెదక్ రహదారి మొత్తం పెద్ద పెద్ద గుంతల మయంగా మారి పాదాచారులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాలకు ఎంతో కొంత విముక్తి కల్పించాలని సదుద్దేశంతో వెల్దుర్తి మండల BRS పార్టీ అధ్యక్షులు, ఉప్పులింగాపూర్ మాజీ సర్పంచ్ వంచ భూపాల్ రెడ్డి చొరవతో బుధవారం వెల్దుర్తి కంకర మిషన్ వాళ్ళ సహకారంతో రోడ్డుపైన డస్ట్ పౌడర్ చిప్స్ తో కూడిన కంకర వేసి తాత్కాలికంగా దగ్గరుండి
గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు,వంచ భూపాల్ రెడ్డి లు వెల్దుర్తి కంకర మిషన్ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
★మెదక్ , నర్సాపూర్ ఎమ్మెల్యేలు ఇద్దరు డబుల్ రోడ్డు విస్తరణ కోసం కృషి చెయ్యాలి★
జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మెదక్ రోడ్డు పెద్దపెద్ద గుంతల మయంగా మారి ప్రయాణానికి , ప్రజా రవాణా సౌకర్యం కోసం బస్సులు కూడా ఈ రహదారి గుండా రావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొనే విధంగా మెదక్ , నర్సాపూర్ ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రభుత్వానికి డబుల్ రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపాలని వెల్దుర్తి మండల ప్రజల కోరికలు నెరవేర్చాలని
వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి కోరారు.