నేటి గదర్ న్యూస్ జులై24: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
వైరా పట్టణం.
సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో….. ఖమ్మం జిల్లా, వైరా సమితి, వైరా లో గత 3 సంవత్సరాలుగా సత్యసాయి వేద పాఠశాల విజయవంతంగా నడుస్తున్న విషయం, సత్యసాయి కృప, గురువుల నిరంతర కృషి, విద్యార్థుల దృఢ సంకల్పముతో విద్యార్థులు చక్కటి శిక్షణ పొందుతున్న విషయం విదితమే.
సత్యసాయి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని, 13/7/2024 నుండి 22/7/2024 వరకు నవాహ్నిక (9రోజులు దీక్ష) దీక్షా పూర్వకంగా వారణాశి శృంగేరి పీఠం నందు వైరా వేద పాఠశాల విద్యార్థులచే.
సహస్ర చండీ సహిత అతిరుద్ర నవగ్రహ లక్ష్మి గణపతి మహామృత్యుంజయ మహాయాగం నిర్వహించడింది.
ఈ సందర్భంగా
ప్రముఖులు, తెనాలి జ్ఞాన భాగవతం సప్తాహ ట్రస్ట్ చైర్మన్ శ్రీ దివాకర్ గారు ఖమ్మం జిల్లా వైరా వేద పాఠశాల విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ కాశీ క్షేత్రంలో నిర్వహించిన సహస్ర చండీ యాగంలో విద్యార్థులు ఎంతో శ్రద్ధతో పాల్గొన్నారని, వారి పెర్ఫార్మెన్స్ బాగుందని,వేదాల మీద ధ్యానం పెట్టాలని, వారు అత్యుత్తమ వేద పండితులు గా వృద్ధి లోకి వస్తారని శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. గురువు దర్భాకుల కుమార శర్మ. అనుక్షణం విద్యార్థుల వెంట వుండి, వారి యోగ క్షేమాలు చూస్తున్నారని అభినందించారు.
సత్య సాయి ఆశీస్సులు వేద విద్యార్థులకు, గురువులకు నిండుగా వుండాలని కోరుకున్నారు.