కీనో కార్పస్ మొక్కలు ప్రజల ప్రాణాలకు ముప్పు….!
నేటి గదర్ ప్రతినిధి ,చర్ల :
✍️నేటి గదర్ ప్రతినిధివరప్రసాద్
చర్ల మండల కేంద్రంల్లో కొయ్యురు గ్రామ పంచాయతీ పరిధిలో విరివిగా దర్శనం ఇస్తున్న.కీనో కార్పస్ చెట్లు వివరాలకు వెళ్తే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని పెద్దలు చెప్పారు. అందుకే పెద్దలు మొక్కలు నాటే కార్యక్రమం ఒక వనమాహోత్సవంగా చేపట్టేరు . పచ్చని చెట్లతో గాలిలో ఆక్సీజన్ పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమావుతాయి. కానీ కొన్ని మొక్కలు పర్యావరణo, మానమాలికి ప్రమాదకరంగా మారాయి. అలాంటి మొక్కలలో కీనో కార్పస్ మొక్క ఒకటి, చర్ల మండలం కొయ్యురు గ్రామ పంచాయతీ కొయ్యురు గ్రామం లో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం లో ప్రాధమిక పాఠశాల ప్రాంగణం లో విరివిగా కీనో కార్పస్ మొక్కలు నాటేరు. ఈ మొక్కలు అందంగా, ఆకర్షణంగా, వేగంగా పెరగడం, వీటి ప్రధమ లక్షణం అలాగే ఈ మొక్కల ద్వారా పుప్పాడి రేణువులు గాలిలో కలిసి గాలిని కలుషితం చేసి శ్వాసకోశ వ్యాధులు, పర్యావరణ సమతుల్యాతను దెబ్బతిస్తుంది. గత (BRS) ప్రభుత్వం లో అధిక నిధులు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగంపర్చి, కాంట్రాక్టర్లు ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ మొక్కలు ఇప్పుడు ప్రజలు, జంతు, క్రిమి కిటకాల ప్రాణాలను తోడేస్తున్నాయి. వెంటనే ఈ మొక్కలు గ్రామ పంచాయతీ అధికారులు వైద్యాశాఖల సమన్యాయంతో తొలగించాలని.అలాగే పర్యావరణనికి,తొడ్పాడే పూలు, పండ్లు, వేప, కానుగ, వంటి మొక్కలు నాటి పర్యావరణ సమాతుల్యం, రక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.