+91 95819 05907

సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘాలు ఓకే టాను ముక్కలు…

★పైరవీలకు ప్రాధాన్యత ఇస్తూ కార్మిక సంక్షేమాన్ని తూట్లు పుడుస్తున్న నాయకులు…

★సింగరేణి క్వార్టర్ లలో విష సర్పాలతో బెంబేలెత్తుతున్న కార్మిక కుటుంబాలు…

★సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాలి…TBGKS ఉపాధ్యక్షులు నాగేల్లి వెంకటేశ్వర్లు.

నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 29:
నైనారపు నాగేశ్వరరావు✍️

సింగరేణి ఎన్నికలో గెలిచిన కార్మిక సంఘాల నాయకులు ఓకే టాను ముక్కలుగా వ్యవహరిస్తూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఏరియా TBGKS బ్రాంచి ఉపాధ్యక్షులు నాగెల్లి వెంకటేశ్వర్లు ఆరోపించారు.కార్మిక వాడలతో పాటు గనులు,డిపార్ట్ మెంట్ లలో పారిశుద్యం లోపించి దోమలు విపరీతంగా వృద్ధిచెంది కార్మిక కుటుంబ సభ్యులు రోగాల బారిన పడుతుంటే కార్మిక ఓట్ల ద్వారా గెలిచిన సంఘాలు యాజమాన్యంపై ఏలాంటి ఒత్తిడి తీసుక రాకుండ నామ మాత్రపు ప్రకటనలకే పరిమితం అవుతున్నారని కార్మిక సంక్షేమానికి అరకొర ప్రాధాన్యత ఇచ్చి పైరవీలకు భారీ ప్రాధాన్యతలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.కాలనీ ఏరియాలో,గనులు,డిపార్ట్ మెంట్ లలో నేటి వరకు ఫాగింగ్ పనులు చేపట్టే అంశంలో శ్రద్ద చూపక పోవడమే అందుకు నిదర్శనం అన్నారు.గెలిచిన కార్మిక సంఘాల నిర్లక్ష్యం వల్లనే క్వార్టర్ లోకి విష సర్పాలు వచ్చి చేరుతున్నాయని నిబంధనల ప్రకారం క్వార్టర్ కౌన్సిలింగ్ లు ఏర్పాటు చేపించాల్సిన భాధ్యత గెలిచిన కార్మిక సంఘాలపై ఉన్నప్పటికీ యాజమాన్యంకు వంత పాడుతూ ఉండడం వల్ల ఖాళీ క్వార్టర్ లలో విష సర్పాలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ క్వార్టర్ లలోకి వచ్చి చేరుతున్నాయని కార్మిక కుటుంబ సభ్యులు విష పురుగులతో బెంబేలెత్తిపోయి బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఏరియా హాస్పిటల్ నందు ఎలక్ట్రికల్ వైరింగ్,ఎలక్ట్రికల్ పై ఆధారపడి పని చేస్తున్న ఎలక్ట్రికల్ మిషనరీలను దృష్టిలో ఉంచుకొని కార్మిక సంక్షేమం పట్ల భాధ్యత ఉన్న కార్మిక సంఘంగా హాస్పిటల్ కు మూడు షిఫ్ట్ లలో ఎలక్ట్రీషియన్ ను ఆదివారంతో సహా అందుబాటులో ఉంచాలని డివైసియంఓ కు వినతి పత్రాన్ని ఇస్తే కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై అడ్డుగా నిలవడం వల్లె నేటికి మూడు షిఫ్ట్ లలో ఎలక్ట్రీషియన్ ను నియమించలేదని అయన మండిపడ్డారు.ఏరియా హాస్పిటల్ నందు రోగుల కోసం ఏర్పాటు చేసిన ఏసిలు నిబంధనల ప్రకారం నడపడం లేదని,హాస్పిటల్ కు వచ్చే రోగుల బైక్ షేడ్ నిర్మాణం పెంచడం,బైక్ షేడ్ కు వేసిన రేకులు పూర్తిగా పగిలిపోయి ఉన్నాయని బైక్ షేడ్ దగ్గర ఉన్న ఫ్లోరింగ్ కు పాకురు పట్టి హాస్పటల్ కు వచ్చే వారు జారీ పడుతున్నా సంఘటనలు కో కొల్లలుగా ఉన్నాయని పేర్కొన్నారు.హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా హాస్పిటల్ యాజమాన్యం చర్యలు చేపట్టాలని యాజమాన్యంకు యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న నేటి వరకు సమస్యలకు కార్యరూపం దాల్చలేదని కార్మిక సంక్షేమంపై పట్టింపు ఉంటేనే నిర్దేశించిన లక్ష్యాలు చేరువ అవుతాయనే విషయాన్ని యాజమాన్యం గ్రహించాలని అయన అన్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు,కార్మిక సమస్యలపై సుధీర్ఘ అనుభవం ఉన్న కార్మిక సంఘాలు సమస్యలపై దృష్టి సారించి పలు సమస్యలను పరిష్కరించాలని అయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !