మొక్కలు నాటిన సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు…
◆
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 29:
నైనారపు నాగేశ్వరరావు✍️
జూలై 29వ తేదీ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం (ఐఆర్ఎస్)జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మణుగూరు ఏరియా సింగరేణి సివిల్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏరియాలోని 132 కెవి సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.ఈ సందర్భంగా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సామాజిక కార్యకర్త బౌద్ధం అభిమాని అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ,నిరుపేద కుటుంబంలో పుట్టిన బలరాం స్వయం కృషితో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)గా అర్హత పొంది ఒక్కో మెట్టు ఎక్కుతూ సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని తమ మంచి తనంతో సింగరేణి ఉద్యోగుల మనసును గెలిచారని ఒకవైపు సింగరేణి సంస్థ సంరక్షణకు పాటు పడుతూనే మరో వైపు పర్యావరణ ప్రేమికులుగా ఇప్పటికే 20వేల పైచిలుకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని అలాంటి మనసున్న మారాజు జన్మదిన వేడుకలు సందర్భంగా మణుగూరులో కూడా సింగరేణి సహకారంతో ఉడతా భక్తిగా మొక్కలు నాటామని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా బలరాం అభిమానులుగా ఈ రకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసున్నామని మంగీలాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు బలరాం అభిమానులు కే గురుమూర్తి,కే నాగేశ్వరరావు,కే శ్రీనివాస్,యు శివరామకృష్ణ,ఎం టైసన్,కే నాగరాజు,కుంజా శ్రీను,జి శ్రీనివాస్,ఎస్కె రజబ్ అలీ,ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.