నేటి గద్దర్ రంపచోడవరం న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశాలు ,మధ్యాహ్న భోజనం,స్కూల్ శానిటేషన్ యానిమేటర్స్,
ఫీల్డ్ అసిస్టెంట్లు,ఇతర కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల మీద జరుగుతున్న తొలగింపులు,రాజకీయ బెదిరింపులను నిరసిస్తూ సీఐటీయూ జిల్లా కార్యాలయం నుండీ ఐటీడీఏ వరకు ర్యాలీగా వెళ్లి (ఏ.ఎస్.ఆర్) రంపచోడవరం ఐటీడీఏ వద్ద, సోమవారం కార్మికులు అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాను నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల,వాణిశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు,వెంకట్ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శాంతిరాజు జిల్లా నాయకులు కె.రామలక్ష్మి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికార కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లను వేధింపులకు రాజకీయ బెదిరింపులకు గురిచేస్తు ఉపాధి హామీ పీల్డ్ అసిస్టెంట్లు ను 2360 మందిని మధ్యాహ్నం భోజనం కార్మికులను 750 మందిని,వెలుగు యాణిమేటర్స్ ను 500 మంది ని తొలగించడం జరిగిందని,అదేవిదంగా అంగన్వాడి,ఆశావర్కర్లు, స్కూల్ శానిటేషన్,పంచాయతీ కార్మికులను రాజకీయ వేధింపులకు పాల్పడుతూ,బెదిరింపులకు గురి చేస్తూ మీ ఉద్యోగాలు మానివేయ్యాలని,ఉద్యోగానికి తక్షణమే రాజీనామాలు చేయాలని తీవ్ర వత్తిడి చెయ్యడం చాలా
మూర్కత్వమైన చర్యని అన్నారు.ఈ రాజకీయ నాయకుల వత్తిడి వల్ల అంగనివాడి కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తు చేశారు.ఇలా అనేక కార్మికులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎవరిని బెదిరించకూడదని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. అయినప్పటికీ బెదిరించడం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు స్కీం వర్కర్లు అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు ,కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రజల వద్దకు తీసుకోనిపోవడం లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి చిన్న ఉద్యోగుల పైన రాజీనామా లు చేయించడం, బెదిరించడం,తొలగింపులు సమంజసం కాదని అన్నారు. అధికారులు జోక్యం చేసుకొని బెదిరింపులు,రాజీనామాలను నిలుపుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో వున్న ప్రజా ప్రతినిధులు ఇలాంటి వాటికి అవకాశం లేకుండా కింది స్థాయిలో ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా దేవిపట్నం మండలం ములకలగూడెం అంగనివాడి కార్యకర్త నాగమణి పై లోకల్ టీడీపీ నాయకులు రాజకీయంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తొలగించిన అనేక కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ కి అందజేశారు.ఈ రాజకీయ, వేధింపులు,తొలగింపులు, ఆపకపోతే అదేవిధంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఇంకా బారి ఎత్తున ధర్నా చేస్తామని కూటమి ప్రభుత్వానికీ హెచ్చరించారు.ఈ పోరాటానికి కార్మికులందరు పెద్ద ఎత్తున సిద్ధం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ.సిరిమల్లిరెడ్డి సీఐటీయూ జిల్లా కమీటీ సభ్యులు,కె.చెల్లాయమ్మ,నాయకులు రత్నకుమారి,అరగటి, రామకృష్ణ, వీరాలక్ష్మి,రాధమ్మ,జె.వీరమాణిక్యం,మంగాయమ్మ,గౌరి,అంగనివాడి, ఆశ వర్కర్లు, మధ్యాహ్నం భోజనం,స్కూల్ శానిటేషన్ కార్మికులు,వెలుగు యాణిమేటర్స్,తదితర కార్మికులు పాల్గొన్నారు.