గిరిజన ప్రజల ఆందోళన ఆవేదన
ఎం పిటి సి, బుజ్జి బాబు
నేటి గద్దర్ గూడెం కొత్త వీధి న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గూడెం కొత్త వీధి మండలం,జికె వీది పంచాయతీ, కి చెందిన పికె గూడెం, పాము రాయి,కుంకుంపూడి,పిటిజి గ్రామాలకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పాడేరు.2021,22సంవత్సరంలో, పై తెల్పిన గ్రామాలకు రక్షిత మంచినీటి పథకం,. ఆర్ ఒ, ప్లాంట్ ద్వారా అందించాలని మంచి ఉద్దేశంతో , ప్రభుత్వం లక్షలాది రూపాయలు, మంజూరు చేస్తే, కాంట్రాక్టు లు,చెడ్స్,నిర్మించి, వాటికి సంబంధించిన మెటీరియల్,చెడ్స్, లో జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది.కాని ఆయా గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేదని.దినిపై సంబంధిత అధికారులు కూడ పట్టించుకొలేదని అన్నారు. ఇప్పటికైనా, పై అధికారులు ఆర్ ఒ, ప్లాంట్స్, ప్రారంభం కాకుండా ఉండడానికి గల కారణాలు ఏమిటో, తక్షణమే విచారణ జరిపించాలని ఎంపిటిసి బుజ్జి బాబు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో , తెలుగు దేశం నాయకులు ముక్కలి మహేష్,గుంటా బుజ్జి బాబు, గ్రామస్తులు,గెమ్మెలి కామేశ్వరరావు,దావిద్, లక్ష్మణరావు, పాము రాయి గ్రామానికి చెందిన,పాలిక దావిద్, మరియు గ్రామస్థులు, పాల్గొన్నారు.