రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్
హుకుంపేట: మండలంలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయాన్ని అదనుగా చూసుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మండలంలో తీగల వలస, సంపంగి పుట్టు , దిగుడు పుట్టు, హుకుంపేట మండల కేంద్రంలో తదితర ప్రాంతాల్లో గడ్డ వాగులు నుంచి ఇసుక పగలు సమయం డ్రంపింగ్ చేసి రాత్రి సమయం టిప్పర్లతో తరలిస్తున్నారు. పగలు సమయంలో మాత్రమే ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మాత్రమే అధికారులు పట్టుకోగలుగుతున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు మాఫియా రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 5 గంటలలోపు అక్రమ రవాణా సాగిస్తున్నారని పలువురు ప్రజలు తెలిపారు.
Post Views: 59