*స్పందించరా మేధావులారా*…!
*రాజకీయ నాయకులారా*… !!
*అబలలపై అత్యాచారాలు ఆగేదెప్పుడు*…!
*తూతూ మంత్రంగా హడావిడి చేస్తే సరిపోతుందా*…!
*చట్టాల్లో మార్పు, ముద్దాయిలకు శిక్ష వెంటనే అమలు చేయాలి*
– చుంచు కుమార్
సీనియర్ జర్నలిస్ట్
దేశంలో ఎక్కడో అక్కడ ఏదోచోట అత్యాచారాలు లైంగిక వేధింపులు…! విద్య పేరుతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు…!
జరుగుతూనే ఉన్నాయి…!!
ప్రభుత్వాలు మాటలకె పరిమితం అవుతున్న ఈ రోజుల్లో ఎవరు స్పందించాలి…!
ఆ యొక్క ఆ బాధితులకు ఎవరు న్యాయం చేయాలి….!!
విద్యాలయాలలో జరిగే ర్యాగింగ్లు లైంగిక వేధింపులు అత్యాచారాలు ఆత్మహత్యల కేసులు…!
ఎంతమంది దోషులకు న్యాయస్థానాలలో శిక్షలు వేయించ గలిగారు….!
ఈ ప్రభుత్వాలు శ్వేత పత్రం విడుదల చేయాలి . అడిగే ధైర్యం రావాలి..!!విద్యార్థి తల్లిదండ్రులకు…!
దేశంలోని మేధావులను ..!
రాజకీయ నాయకులను నిగ్గదీసి అడగాలి న్యాయం ఎప్పుడూ…! !
బాధితుల గుండె భారం తగ్గేది ఎప్పుడు అని…!!
న్యాయస్థానాల్లో నమ్మకం లేక సమాజం చిన్నచూపు చూసే ధోరణిలో వెళుతుంది.
మీడియా దృష్టిని ఆకర్షించేందుకే….!
కార్యక్రమాలకు పరిమితం అవుతున్నాం..!
తరువాత ఎవరి దారి వారిది….!
కేసులు ఏమయ్యాయో తెలియదు..!
వాటి యొక్క పూర్వపదాలు పరపదాలు తెలియక మీడియాకు రాక సమాజం అడగలేక నిందితులకు శిక్షలు లేక దర్జాగా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ మళ్లీ అదే పనిగా చేస్తూ ఎంతోమంది అమాయకు అభివృద్ధికునే రౌడీ మూకులకు శిక్షలు బంధించేది ఎప్పుడు..!
సమాజానికి న్యాయస్థానాలపై నమ్మకం కలిగేది ఎప్పుడు…!
ఇదంతా చూస్తుంటే న్యాయస్థానాలపై నమ్మకం కలుగుతుందా…!
ఎక్కడో కాదు నీ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరిగే….!
అత్యాచారాలను లైంగిక వేధింపులను….! ఒత్తిడితో చేసుకుంటున్న ఆత్మహత్యల పై ఇదే స్ఫూర్తితో ఎదుర్కొందాం సంఘటితమవుదాం…!
ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు జరగకుండా అందరం కలిసికట్టుగా ఎప్పటికప్పుడు సమాజం మేల్కొల్పు కోసం సమాజం కోసం దిశా నిర్దేశిస్తూ ఎక్కడ ర్యాగింగ్ జరిగినా ఎక్కడ అమలపై అన్యాయం జరిగిన దానిపై శిక్ష వేసింతవరకు టెలి లైవ్ కాస్ట్ చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నాం.
– చుంచు కుమార్
– సీనియర్ జర్నలిస్ట్
– రాజకీయ విశ్లేషకులు