◆రెవెన్యు అధికారులకు ఐటిడిఎ పిఓ ఇచ్చిన గడువు ముగిసింది
◆దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు బహిర్గతం చేయాలి*
ఆదివాసీ గిరిజన సంఘం.
నేటి గద్దర్ హుకుంపేట న్యూస్
హుకుంపేట మండలం ఆగస్టు 22న మండల కేంద్రంలో.గిరిజనేతరులు చేపట్టిన అక్రమనిర్మాణాలపై ఐటిడిఎ పిఓ, వి అభిషేక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శర్మ ఈనెల 13న స్వయాన పరిశీలించరు. ఆదివాసీ గిరిజన సంఘం ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా దర్యాప్తు చేసి 20వ తేదిన అందజేయాలని రెవెన్యు అధికారులకు ఆదేశించి అన్నారు.
నిన్నటితో ఆ గడువు ముగిసింది.
రెవెన్యు అధికారుల దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలను,పిర్యాదు చేసిన గిరిజన సంఘం నాయకులకు తెలియ జేయాలని, సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి సోమన్న టి క్రిష్ణరావు లు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.రేపు రాష్ట్ర వ్యాప్తంగా,ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో బాగంగా,
హుకుంపేట పంచాయితీలో జరిగే గ్రామసభలో అక్రమ నిర్మాణాలపై చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు.
అన్ని శాఖల అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నందున పంచాయితీ సర్పంచ్, అధికారులు,గ్రామ అభివృద్ది అంశాలతో పాటు అక్రమ నిర్మాణాల అంశం అజెండాలో చేర్చాలన్నారు.