గసభ పంచాయితీ గ్రామ సభ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ పాంగి. సునీత అధ్యక్షతన విజయవంతం
నేటి గదర్ డుంబ్రిగూడ న్యూస్:
పంచాయతీ ప్రజల దగ్గర నుండి వ్యక్తిగత పనులు, ఉమ్మడి పనుల వంటి సమస్యలపై అవగాహన పరిచి ధరఖాస్తలు స్వీకరించారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు,జాబ్ కార్డుల ధరఖాస్తులు ,పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం వంటి షేడ్స్ నిర్మాణం కోసం ధరఖాస్తులు తీసుకున్నారు. అలాగే పంచాయతీ పరిధిలోని ఉన్న గ్రావేల్ రోడ్లు, బీటీ రోడ్డు,మెటల్ రోడ్డు,అంగన్వాడీ, పాఠశాల భవనం ప్రహరీ గోడలు,పంట కాలువలు నిర్మాణం కోసం వినతులు స్వీకరించారు. ప్రజల దగ్గర నుండి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ప్రజల దగ్గర నుండి ప్రత్యక్షంగా వినతులు స్వీకరించి ,గ్రామ సభలో ఆమోదం తెలిపిన పనులకు మాత్రమే తీర్మానం చేయాలని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గత ప్రభుత్వ హాయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ,గ్రామ సభ విలువలకు విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో జరగబోయే సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు కూడా గ్రామ సభ ద్వారా మాత్రమే ఆమోదం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు ప్రారంభించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సభ నోడల్ అధికారి జోహన్ గారు, పంచాయతీ సెక్రటరీ డొంబుర్ దార్ గారు ఎంపిటిసి వంతాల. జెమ్మ గారు,గసభ మాజీ సర్పంచ్ పాంగి. సురేష్ కుమార్ గారు వార్డుమెంబర్స్, ఫీల్డ్ అసిస్టెంట్,టెక్నికల్ అసిస్టెంట్లు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సచివాలయ ఉద్యోగులు,ప్రజలు పాల్గొన్నారు.