రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 17:- తాగుడుకు బానిసై,ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.కామారెడ్డి రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామానికి చెందిన వెంకటాపురం శివరాములు (39) ఎస్సీ కులానికి చెందిన వాడు వృత్తి రీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.అతని భార్య సంతోష కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో శివరాములు తాగుడుకు బానిసైన ఆర్థిక ఇబ్బందులకు తాళలేక మంగళవారం తెల్లవారుజామున అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.మృతునికి భార్య సంతోషి, నిఖిల్,నికిత ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ మేరకు క్రైమ్ నెంబర్ 183 / 2024 U/S 194 BNSS S/D క్రింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావుర్య నాయక్ తెలియపరచారు.