నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 18: తల్లాడ ప్రతినిధి శ్రీనివాస నాయుడు.
తల్లాడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖమ్మం వరద బాధితుల ఆర్థిక సహాయం కోసం తల్లాడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి , వైరా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేమిశెట్టి నాగేశ్వరరావు (నాగన్న) ఆధ్వర్యంలో 10 క్వింటాల బియ్యాన్ని , మరియు తల్లాడ మండల గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ బాజోజ్ శేషభూషణం ఆధ్వర్యంలో 10,000 వేల రూపాయల నగదును మన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ సత్తుపల్లి క్యాంప్ ఆఫీస్ నందు ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అందజేయడం జరుగుతుంది. కార్యక్రమంలో శేషభూషణం, వేమిశెట్టి శంకర్, తొండపు వెంకటకృష్ణ, దుండేటి వీరారెడ్డి , దగ్గుల రఘుపతి రెడ్డి, షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 14