★ ఆ తాసిల్దార్ అక్రమాలపై ప్రత్యేక అధికారిని నియమించి పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేయాలి
★ బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
పినపాక: ఏజెన్సీ నిబంధనలు అతిక్రమించి ఇష్టా రీతిన డబ్బులు దండుకున్న తాసిల్దార్ ని విడుదల నుంచి తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ పాటిల్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పినపాకలో స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విధుల నుంచి తొలగించబడ్డ తాసిల్దార్ తోట సూర్యనారాయణ పార్లమెంటు ఎన్నికలకు ముందు పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని తాసిల్దార్ కార్యాలయాన్ని కేజీల లెక్కన అమ్ముకున్నారని ఆరోపించారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర అని తేడా లేకుండా చట్టానికి విరుద్ధంగా పట్టాలు చేసి రూ.2కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తమ దగ్గర సమాచారం ఉందని తెలిపారు. ఎకరాకు లక్ష నుండి రెండు లక్షలు తీసుకొని వారసత్వ పట్టాలు మంజూరు చేసినాడు. గత రెండు మూడు సంవత్సరాలు, ఇటీవల కొన్న గిరిజనుల నుంచి గిరజనేతరులు కొనుగోలు చేసిన భూములకు సైతం పట్టాలు చేసి పాసుబుక్కు ఇప్పించారని అన్నారు. సూర్యనారాయణ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన సమయంలో భూములకి ఇచ్చిన అన్ని పట్టాదారు పుస్తకాలపై విచారణ చేయడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని భవాని శంకర్ కోరారు.
ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అధికారులు దోచుకోవడం తగదని… నిస్వార్ధంగా సేవలించాలని ఆయన అధికారులకు సూచించారు.