చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
సమాజ హితం కోసం తమ కలాన్ని గలాన్ని వినిపించే విలేకరులకు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ నిరంతరం అండగా ఉంటుంది
వైరుధ్యాలను పక్కనబెట్టి విలేకరులందరూ ఐక్యంగా ముందుకు సాగాలి
ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనాలను తీవ్రంగా వ్యతిరేకించాలి
పోలీసు వారు విచారణ చేసి సదరు దుండగులను గుర్తించి తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.
గత మూడు రోజుల క్రితం మత్తు పదార్థాలు నివారించాలని మత్తు పదార్థాలు సేవించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను కాపాడాలని మత్తుపదార్థ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని వార్త రాసినందుకు ప్రజాజ్యోతి విలేఖరి అలవాల సతీష్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు, ఆకతాయిలు, రౌడీ మూకల్లా రాళ్లదాడి చేయడాన్ని , ఫోన్లు చేసి బెధిరించడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటీవలకాలంలో చర్ల మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న అక్రమార్కులు ప్రశ్నించిన వారిని బెదిరించడం, విలేకరులపై సైతం దాడులు చేయడం పరిపాటిగా సర్వసాధారణంగా మారింది ఇది సమాజ గమనానికి అత్యంత ప్రమాదకరం ప్రశ్నించేవారిని మరియు మంచిని చెడుని సమాజం ముందుకు తీసుకువచ్చి ప్రజలకి తెలియజేసే పాత్రికేయులను దాడులు చేయడం ద్వారా బెదిరించడం ద్వారా నియంత్రించాలని అనుకోవడం దుర్మార్గం. మంచి కోసం తమ కలాన్ని గలాన్ని వినిపించే విలేకరి మిత్రులకు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ నిరంతరం అండగా ఉంటుందని విలేఖరి మిత్రులు ఈ విషయమై చేసే ప్రతి కార్యక్రమానికి పార్టీ సహాయ సహకారాలు ఉంటాయని విలేకరి మిత్రులు వైరుధ్యాలను భేదాభిప్రాయాలను వీడి ఐక్యంగా ముందుకు సాగాలి ఈ ఘటనను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలి గౌరవ పోలీసు వారు ఈ విషయమై తక్షణమే విచారణ చేసి సదరు దుండగులను గుర్తించి వారిపై చట్టపరమైన కట్టిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ డివిజన్ నాయకులు కొండాచారం తెలిపారు.