ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం సందర్భంగా సమస్యలపై కథనం -నూకల అంజి ఫార్మసిస్ట్ మరియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్
◆ప్రపంచ ఆరోగ్య అవసరాలు తీర్చుతున్న ఫార్మసిస్ట్ లు
ఫార్మసిస్ట్ లు ఆరోగ్య రక్షణ వ్యవస్థలో అంతర్భాగం, ఆరోగ్య అవసరాలు తీర్చటంలో వారిది ముఖ్య పాత్ర. ఫార్మసిస్ట్ ల ప్రధాన విధి ఫార్మసీ స్టోర్స్ మెయింటెనెన్స్, వ్యాక్సిన్ లు మరియు ముఖ్యమైన ఔషధాలు, వైద్య పరికరాలు అభివృద్ధి, ఔషధ నిఘా చేసేది, ఆంటీ బయోటిక్స్ అవసరానుగుణ వినియోగం చూచేది కూడా ఫార్మసిస్ట్ లే. కోవిడ్ 19 సమయంలో ఫార్మసిస్ట్ లు ముందు వరుసలో ఉండి ఆరోగ్య సంక్షోభాలు అధిగమించటానికి తోడ్పడిన విషయం అందరికి తెలుసు. ఫార్మసిస్ట్ ల సేవలను గుర్తించి, వారిని గౌరవించు కొనటానికి, వారు సేవలో పునరంకితులు కావటానికి ఈ సందర్భం దోహద పడుతున్నది. అంతటి మహత్తర ఫార్మసిస్ట్ లను మన దేశం లోని వ్యవస్థలు పూర్తి స్థాయిలో వినియోగించుకో లేక పోతున్నయి. ఫార్మసిస్ట్స్ డే సందర్భంగ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఫార్మసిస్ట్ ల సేవలు వినియోగించు కొనే, వారికి మేలు చేసే విధాన నిర్ణయాలు ప్రకటించాలీ , పురస్కారాలు అందించాలె. *ఫార్మసిస్ట్ ల మేలు -ప్రజల ఆరోగ్యానికి మేలు*. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫార్మసిస్టుల సేవలను గుర్తించి వారి చదువుకు తగ్గ జీతభత్యాలను ప్రభుత్వం ఇవ్వాలని అలాగే ఔషధాలు ఉన్న ప్రతి చోట ఫార్మసిస్ట్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బస్తీ దావకానలో ఫార్మసిస్టులను నియామకం చేపట్టాలని కోరుకుంటున్నాం జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యుల మాదిరి ఫార్మసిస్ట్ నియామకాలు కూడా చేపట్టాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రద్దుచేసి అందరూ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం ఫార్మసిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది రాష్ట్రంలో ఫార్మసీ నిరుద్యోగుల పెరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను ఫార్మసిస్టులతో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫార్మసిస్టులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కావున ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులను క్రియేట్ చేసి అలాగే ఒక స్టోర్ క్రీపర్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను..