మెదక్ (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 30:- మాదిగ,మాదిగ ఉప కులాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని,వారిని తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు వెల్లడించారు.పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు అల్లారం రత్నయ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మాదిగ,ఉపకులాగా ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ల కోసం మాదిగలు పోరాడుతున్నారని,ఇటీవల సుప్రీంకోర్టు మాదిగ రిజర్వేషన్లును ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని,దీన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు.మాదిగల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని,వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు తమకు అండగా ఉంటే తాము వారి వెంట ఎల్లవేళలా ఉంటామని తెలిపారు. మాదిగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తమ వంతు కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు.అదే విదంగా ఎల్లవేళలా కుల మతాలకతీతంగా దళిత వర్గాలను అక్కున చేర్చుకొని సేవలందిస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు అల్లారం రత్నయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని, సమావేశానికి హాజరైన దళిత నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకు విజ్ఞాపన పత్రం అందజేశారు.పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వేషన్ అయిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ, కుల మతాలకతీతంగా బీదల పెన్నిధిగా పేరుగాంచిన రత్నయ్య కు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఆయనకు సరియైన న్యాయం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి త్యార్ల రమేష్ తో పాటు దళిత సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.