నేటి గదర్ న్యూస్,భద్రాచలం:
ఐకమత్యమే మహాబలం అహింస పరమో ధర్మః అని శాంతి సామరస్యంతో భారతీయులందరినీ కలిసి మెలిసి ఉండి అందరిని ఒక తాటిపై నడిపి హింసతో కాకుండా శాంతి సహనంతో బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశాన్ని చేజెక్కించుకున్న మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటిడిఏ యూనిట్ అధికారుల సమక్షంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ 1930 సంవత్సరంలో పూర్ణ స్వరాజ్యం సాధనలో భాగంగా బ్రిటిష్ వారి పునాదులు కదిలించేందుకు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడంతో ఆంగ్లేయులు దిగిరాక తప్పలేదని, అదేవిధంగా ఆయన 1893లో దక్షిణాఫ్రికాలో అల్పసంఖ్యాకుల పట్ల తీవ్ర వివక్ష సాగుతున్న తరుణంలో అణిచివేతను ఎదుర్కొనేందుకు సత్యాగ్రహం అని ఆయుధాన్ని రూపొందించారని, వానా టాల్, కాంగ్రెస్ పార్టీ స్థాపించుకొని తన వాదనలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలలో స్ఫూర్తినింపారని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధిస్తుందని, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. విదేశాల్లో
చదువు ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు దేశం మొత్తం పర్యటించి దేశంలోని ప్రజలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, గ్రామాలు ఎలా ఉన్నాయి వారి జీవన విధానం ఎలా ఉందని ఆనాడే సుశితంగా పరిశీలన చేసి, అపరిశుభ్రత వలన గ్రామీణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, విషయాన్ని గమనించారని ఆయన అన్నారు. ఆయన ఆశయాలు నేడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, వాటిని కింది స్థాయి ప్రజలకు అందే విధంగా మనమందరం గాంధీజీ గారి అడుగుజాడల్లో నడిచి గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని పదిమందిలో స్ఫూర్తి నింపాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏడి అగ్రికల్చర్ భాస్కర్, ఏసిఎంఓ రమణయ్య, డిఎస్ఓ ప్రభాకర్ రావు మేనేజర్ ఆదినారాయణ, ఐటిడిఏ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.