నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిది, ✍️ సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న కానీ 25వ డివిజన్ లో కొంతమంది వికలాంగులు , వితంతువులు , వృద్ధులు దిక్కులేని నిరుపేద పింఛన్ లబ్ధిదారులు గాంధీ దిక్కంటూ గాంధీ పార్క్ లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు . గత ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసిందని అన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వాలకు సృహ కలిగించి తమకు పింఛన్ ఇప్పించాలని గాంధీజీని వేడుకున్నారు . ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రదీప్ కుమార్ , ఎండి అన్వర్ , శ్రీను , తంగిశెట్టి అనసూయమ్మ , విజయలక్ష్మి , ముళ్లపాటి నాగమణి , బోనగిరి నాగమణి తదితరులు పాల్గొన్నారు .
Post Views: 49