★జీవోలు మార్చినంత ఈజీగా సర్టిఫికెట్లు మార్చగలమా
★డీఎస్సీలో హిందీ పండిట్లకు తీవ్ర అన్యాయం
డీఎస్సీ 2024 అభ్యర్థి బాలసాయి ప్రసాద్ ఆవేదన.
మాసాయిపేట మండలం నేటి గద్దర్ ( భూపాల్ ) అక్టోబర్ 13.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో డీఎస్సీ 2024 అభ్యర్థి బాలసాయి మీడియాతో మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2024 సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలలో హిందీ పండిట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అన్యాయం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రారంభం నుండి ఆన్లైన్ దరఖాస్తుతో మొదలుకొని, హాల్ టికెట్ ఇచ్చి,పరీక్షలకు అనుమతి కల్పించి,ర్యాంక్ కార్డు విడుదల వరకు అర్హతలు కల్పించి, ఉద్యోగ అపాయింట్మెంట్ ఇచ్చే సమయంలో విద్యాశాఖ అధికారులు హిందీ పండిట్ లను అనార్హులుగా గుర్తిస్తున్నారు. 2024 డీఎస్సీలో లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టులకు 1:3 రేషియో ప్రకారం ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టుగా హిందీ,పోస్ట్ గ్రాడ్యుయేట్ హిందీ ఉత్తీర్ణులైన వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నారు. 2008, 2012 డిఎస్సీలలో హిందీ విద్వాన్ తోపాటు హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి పూర్తి అర్హతలు కల్పిస్తూ, ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 టిఆర్టి, 2024 లో డీఎస్సీలలో హిందీ విధ్వాన్ను అనర్హతగా పరిగణలోకి తీసుకొని, అదనంగా డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టు హిందీ ఉండాలని నోటిఫికేషన్ లో చేర్చి,హిందీ పండిట్ డిఎస్సి అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని టెట్ అర్హత సాధించారు. 2008 2012 డీఎస్సీ నోటిఫికేషన్లు ఒకలా, 2017 టి ఆర్ టి 2024 డిఎస్సి మరోలా నోటిఫికేషన్ బుల్టెన్లో విద్యార్హతలను చేర్చి డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు.హిందీ విద్వాన్ అర్హత కలిగిన అభ్యర్థులకు కట్ ఆఫ్ తేదీని ప్రకటించాలి. అప్పటి నోటిఫికేషన్లో ఆధారంగా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా హిందీ విద్వాన్ ఉత్తీర్ణులైన వారికి కటాఫ్ తేదీ నిర్ణయించి న్యాయం చేయాలి. 2017 డిఎస్సి నోటిఫికేషన్ గుండెల్లో చేర్చిన విద్యార్హత డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టు హిందీ అర్హతగా, హిందీ విద్వార్ను అనర్హతగా ప్రకటన చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కొంతమంది హిందీ పండితులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు న్యాయం స్థానం జీవో నెంబర్ ఎంఎస్ 25 ప్రకారం హిందీ విద్వాన్ విద్యార్హత కలిగిన అభ్యర్థులను ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటన చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ సమయంలో హైకోర్టు తీర్పుతో హిందీ విద్వాన్ అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ మళ్లీ 2024 డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో హిందీ పండిట్లకు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాత వైఖరిని అవలంబిస్తూ మొండి చేయి చూపుతున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు.