❇️ హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తునాడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం 👇
✴️ బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసింది. కానీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం
✴️ 50 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకొడుతున్నారు. మీరు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవే కాదా?
✴️ ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, అవన్నీ తామే చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు
✴️ కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఈరోజుకి 10% కూడా పూర్తి చేయలేదు.
✴️ 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి
✴️ ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా అమలు చేయలేదు
✴️ 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు
✴️ ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఇంకా ప్రారంభం కాలేదు
✴️ ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్న రకాలకు మాత్రమే పరిమితం చేశారు
✴️ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఉసేలేదు
✴️ మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ గుర్తు కూడా లేదు
✴️ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు నెరవేరతాయని చెప్పారు. కానీ, ప్రభుత్వం వచ్చి 300 రోజులు గడిచినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు
✴️ కొత్త హామీల సంగతి దేవుడెరుగు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అటకెక్కించింది. రైతు బంధు,దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, పోషక కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, బతుకమ్మ చీరలు ఇంకా ఎన్నో పథకాలు నిలిచిపోయాయి
✴️ వాస్తవాలు ఇలా ఉంటే.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు
Harish Rao Thanneeru