బహుజన,సామాజిక ఉద్యమకారుడు రవీందర్ నాయక్.
నేటి గదర్ న్యూస్ నవంబర్1: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
తెలంగాణలో బహుజనవాదం బలోపేతం కావాలంటే ప్రతి గ్రామం లో పర్యటించక తప్పదు.ఇది 100%నిజం. గమనించగలరు మిత్రమా.
ఎందుకంటే ప్రతి గ్రామంలో అగ్రకుల ఆధిపత్యం కింద , మన బహుజన సమాజం దాసోహమై బ్రతుకుతావుంది. గ్రామాలలో బహుజనులకు వారి అస్తిత్వం తెలియకుండా, పార్టీల ముసుగులో ఆధిపత్య కులాలనుంచి విముక్తి పొందలేనంత వరకు, ఎంతో శాతం ఓటు బలం ఉన్నప్పటికీ , గ్రామంలో రాజకీయంగా ఎవరికి ఎవరు మిత్రువు ?? ఎవరు శత్రువు ?? అనే విషయం యొక్క మరమ్మత్తు తెలియకుండా ఆ జాతులు రాజకీయంగా అభివృద్ధి చెందదు, రాజకీయంగా చైతన్యం పొందదు. ఈ రెండు మార్పు జరగకుండా ఏ గ్రామంలో నైనా బహుజనవాదం బలపడటం అసంభవం ఇది ఎవరు నమ్మిన నమ్మకపోయిన ఇదే నిజం నిజం నిజం. ఉంటాను మిత్రమా మీ రవీందర్ నాయక్. డోర్నకల్.