రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ముద్రబోయిన మల్లయ్య (48) అనే వ్యక్తి వృత్తి రీత్యా మత్స్యకారుడు తను చేపలు పట్టుకునే చెరువులో నష్టం రావటంతో అప్పుల పాలు అయ్యాడు.దీంతో శుక్రవారం రోజు ఉదయం అందాజ 7 గంటల సమయంలో జీవితం పై విరక్తి చెంది నిన్న రాత్రి సమయంలో ఇంట్లో నుండి వెళ్లి లక్ష్మాపూర్ గ్రామ శివారులోని చెట్టుకు లుంగితో ఉరివేసుకొని మృతి చెందాడు.ఇట్టి విషయమై మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై బాలరాజ్ విలేకర్లకు తెలిపారు.
Post Views: 117