+91 95819 05907

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

*ధాన్యం, పత్తి పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తవద్దు.*

*సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి.*

*రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.*

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పట్టిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించిన వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు. వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన వరి ధాన్యం, పత్తి పంట, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటలను అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సన్న వడ్లపై క్వింటానుకు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇండ్లు, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లుకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు సంబంధించి నిర్వహణ తీరును అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో నిర్వహించిన సర్వేకు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని జనాభా, కుటుంబాలు, ఎన్యుమరేషన్ బ్లాకులు, సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లకు సంబంధించి వివరాలు అధికారులు మంత్రికి వివరించారు. సర్వే లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించి సర్వేలో భాగస్వాములను చేయాలని సూచించారు.
అనంతరం బైంసా పట్టణం సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి ఇండ్లను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం భైంసా పట్టణంలోని జిన్నింగ్ మిల్ ని సందర్శించి, పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నష్టపోకుండా పంట నాణ్యత, తేమశాతానికి సంబంధించి వివరాలను తెలిపి అధిక లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నిర్మల్, బైంసా ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి శ్రీనివాస్, డిఎస్ఓ కిరణ్ కుమార్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు అశోక్ కుమార్, తహసిల్దార్ ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !