బిసి’లకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కేటాయించాలి:: mepa
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్,డిసెంబర్ 31:
*కులగణన ఆధారంగా రానున్న స్థానిక ఎన్నికల్లో బిసి’లకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కేటాయించాలి.*
*అచ్చునూరి కిషన్ ముదిరాజ్.*
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.
ములుగు జిల్లా కేంద్రంలో మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రోపెషినల్స్ అసోసియేషన్) జిల్లా కార్యాలయంలో….మెపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్ అధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ విచ్చేసి మాట్లాడుతూ….* కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి లో ప్రకటించిన బిసి డిక్లరేషన్, మేనిఫెస్టో లో తెలిపిన ప్రకారం, అలాగే కులగణన ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి’లకు అత్యధికంగా రిజర్వేషన్లు కేటాయించాలని, బిసిల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ’తోనే సాధ్యం అనే విధంగా స్థానిక రిజర్వేషన్ల కేటాయింపు జరగాలని, కామారెడ్డి బిసి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని, “మేము ఎంతో– మాకు అంత” అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తెరిగి అత్యధిక శాతం రిజర్వేషన్లు బిసిలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అని కిషన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు భూమ నరేష్ ముదిరాజ్, వెంకటాపుర్ మండల అధ్యక్షుడు మేకల రమేష్ ముదిరాజ్, కల్లెబోయిన కిరణ్ ముదిరాజ్, కుక్కల కౌశిక్ ముదిరాజ్, పండు ముదిరాజ్, రఘు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.